మనలో ఉన్న అసురుడు (చెడు)ని అధిగమించడం

0
973

దీపావళి ఎలా జరుపుకుంటారు?

దీపావళిని దీవాలి అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా హిందువులు, సిక్కులు మరియు జైనులు జరుపుకునే దీపాల పండుగ. ఈ పండుగ మూడు నుండి నాలుగు రోజుల పాటు విస్తరించి ఉంటుంది. మరియు సంవత్సరంలో జరిగే వేడుకలలో అందరు ఆసక్తితో ఎదురుచూచే సమయాలలో ఇది ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించడానికి ఈ సమయంలో ఇళ్లలో వందలాది దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజు ఈ సంబరాలికి హైలైట్. ఆ రోజు కుటుంబసభ్యులందరు కలిసి నూనె స్నానాలతో ప్రారంభించి, బహుమతులు మరియు పిండివంటలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తర్వాత సంవత్సరంలో అత్యంత ఉత్తేజకరమైన సంఘటన – బాణాసంచా. బాణసంచా కాల్చడం తెల్లవారుజామున ప్రారంభమై రాత్రి వరకు సాగుతాయి. దీపావళి పండుగ సమయంలో ఉండేటువంటి ఉతేజకరమైన వాతావరణం వివరించడానికి పదాలు సరిపోవు. దానిని అక్కడ ఉండే అనుభవించాలి.

ఈ ఉల్లసానికి కారణం ఏమిటి?

చెడుపై మంచి సాధించిన విజయాలకు సంబంధించిన కధలు మన వేదాలు పురాణాలలో చాలా ఉన్నాయి. అవి సాధారణంగా అసురులు (అమాయకులను భయభ్రాంతులకు గురి చేసే, అతీంద్రియ శక్తులు కలిగిన దుష్ట వ్యక్తులు) సంహరించబడడంలో సూచించబడతాయి. దీపావళి సాధారణంగా వనవాసాల తర్వాత శ్రీరాముడు తిరిగి రావడం (అసురుడైన రావణుడిని ఓడించిన పరియన్తం) లేదా శ్రీకృష్ణుడు నరకాసురుని (మరొక అసురుడు) ఓడించడంతో సంబంధం కలిగి ఉంటుంది. చాలా ప్రదేశాలలో బాణసంచాతో నిండిన రావణుని దిష్టిబొమ్మలను దహనం చేస్తూ భారీ ప్రదర్శనలు చేస్తారు. ఇది దుష్ట రావణుని నాశనం చేయడానికి ప్రతీక. మన తూర్పు దేశాల్లో ఉండే ఆలోచన విధానం లో ఆత్మపరిశీలన అంతర్లీనంగా ఉండడం వలన దీనిని మనలో ఉన్న చెడును ఓడించడంతో అనుబంధించడం జరుగుతుంది (స్వీయ-శుద్ధి చర్య). అనేక చలనచిత్ర ఎత్తుగడలు మరియు అధునాతన ఆధ్యాత్మిక బోధనలు, రావణుడిని (చెడు) లోపలి నుండి తొలగించడం, తద్వారా మనలో రాముడు (మంచి) ఉండటం అనే విషయాన్నీ ప్రతిబింబిస్తాయి.

వేరొక దృక్కోణం: లోతైన వ్యక్తిగత అర్థం ఏమైనా ఉండవచ్చా?

వేడుకలను పక్కన పెడితే, మనం లోపల ఉన్న చెడును తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామా? లోపల ఉన్న చెడును జయించడంలో ఎవరైనా నిజంగా విజయం సాధించారా? లోపల ఉన్న చెడును ఓడించడానికి కేవలం మానవ ప్రయత్నాలు సరిపోతాయా? మీరు ఎంత ప్రయత్నించారో నాకు తెలియదు. అది మీకు మరియు దేవునికి మాత్రమే తెలుసు. అయితే నేను చాలా సంవత్సరాల ఆత్మపరిశీలన మరియు స్వీయ-శుద్ధి ప్రయత్నాల తర్వాత, ఏమాత్రం కూడా ముందుకు సాగలేకపోతున్నానని గ్రహించాను. నా వైఫల్యాల జాబితా మాత్రమే పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను నా కంటే ముందు నడిచిన వారితో చర్చించి తెలుసుకున్నది ఏమిటంటే వారు కూడా అదే పడవలో ఉన్నారు.

భారతదేశపు చరిత్రలో నుండి వచ్చిన మహనీయులలో ఒకరైన మహాత్మా గాంధీ గారిని కూడా తీసుకుందాం. ఆయన ఈ స్వీయ-శుద్ధి అన్వేషణలో ఆదర్శనీయమైన వ్యక్తి. మహాత్మా గాంధీ గారు గొప్ప జీవితాన్ని గడిపారు మరియు సత్యాన్ని అనుసరించడంలో అతని అంకితభావాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే, తన ఆత్మకథ, “మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్”లో, ‘ఫేర్‌వెల్’ అనే చివరి అధ్యాయంలో ఇలా పేర్కొన్నాడు,

“అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకొ అందుకోలేదు.”

మానవీయంగా అధిగమించలేని అడ్డంకి, కానీ నిరీక్షణ ఉంది

సరే, అయన ఘనమైన జీవితాన్ని బట్టి “మహాత్మా” అనే బిరుదు పొందిన మహాత్మా గాంధీ గరే తన ముందు ఇంకా కష్టమైన మార్గం ఉందని హృదయపూర్వకంగా చెబితే, మీరు మరియు నాలాంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? మనం చేయగలిగినదంతా చేసినా, లోపల ఉన్న అసురుడిని (చెడుని) మనం ఎప్పటికీ ఓడించలేమా? అందుకేనా దీన్ని సరిదిద్దడానికి మనకు అనేక జన్మలు అవసరమని భావిస్తున్నామా? మరొక విధానం ఉందా? శుభవార్త ఏమిటంటే, దేవుని విధానం ఉంది, అది మనకు అన్వేషించడానికి అందుబాటులో ఉంది, అందులో మన శక్తీ ద్వారా కాకుండా ఆ దేవుని శక్తితో అసురుడిని జయించగలము. బహుశా, ఈ శుద్దీకరణను ఎలా వర్తింపజేసుకోవాలో తెలుకోవడం దీపావళి సమయంలో అన్నిటికంటే మంచి బహుమతి కావచ్చు. ఈ మర్మాన్ని మనం అన్వేషిద్దాం.

మనలోని అసుర స్వభావము బాహ్యంగా ఉండే అస్తిత్వం కంటే చాలా జఠిలమైనది. మనకు శాశ్వతమైన స్వేచ్ఛను ఇచ్చేందుకు, దేవుడు మన సంచిత కర్మ (గతం) నుండి మనకి విముక్తి కలిగించాలి, మరియు చెడుకి లొంగిపోయే మన ధోరణిని (ప్రస్తుతం) ఓడించే సామర్థ్యాన్ని కూడా మనకు అందించాలి. 

అమరుడైన దేవుడు యేసు ప్రభు, మన కోసం ఉంచబడిన శిక్ష యొక్క పూర్తి దెబ్బను తానే స్వీకరించి, మనకొరకు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు మన గతంపై ఈ విజయం సాధించబడింది. 

యేసు ప్రభు తాను పునరుద్ధానుడైన తరువాత తన పరిశుద్ధాత్మను (దేవుని ఆత్మ) మనలో నివసింపజేయడానికి సాధ్యపరిచాడు (ఆయన మృత్యువును జయించిన తర్వాత తిరిగి లేచాడు). పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి వచ్చినప్పుడు ఆయనే మన ఆంతరంగిక గురువుగా ఉంటాడు. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో చెడుపై శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆంతరంగిక గురువైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలకు నిరంతరం అప్పగించుకోవడం ద్వారా, మనలోని అసురుడిపై స్థిరంగా విజయం సాధించవచ్చు.

దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరికి బదులుగా శిక్ష పొందాలని మరియు మనలో ప్రతి ఒక్కరికీ చెడుపై నిజమైన విజయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు.

మనలో ఎవరూ పరిపూర్ణులము కామని, తమ స్వంత మోక్షాన్ని సంపాదించుకోవడానికి తగినన్ని మంచి పనులు చేయలేమని ఆయనకీ తెలుసు. కాబట్టి దేవుడు మనకు మోక్షాన్ని ఉచిత బహుమతిగా ప్రసాదించాడు – దీనిని “యేసు దీపావళి”గా జరుపుకోవడానికి నేను స్వేచ్ఛను తీసుకుంటున్నాను.

దేవుని దీపము ఎలా అవ్వాలి (యేసు దీపావళిని ఎలా జరుపుకోవాలి)

“యేసు దీపావళి”ని అనుభవించడానికి – యేసు (దేవుని వెలుగు) మీలో ప్రత్యక్షమవ్వాలన్న కోరిక మీకు  ఉండాలి. ఇది వ్యక్తిగత నిర్ణయం. మనకు నిత్యజీవం అవసరమని మనం గ్రహించి, మన పాపాలన్నిటి కొరకు యేసు ప్రభు పూర్తిగా క్రయం చెల్లించాడని మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు, మనం దేవుడిచ్చే మోక్షాన్ని బహుమతిగా పొందగలము. ఈ విమోచనలో భాగంగా పరిశుదాత్మ దేవుడు మనలో నివసించడానికి వస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపింపుకు అప్పగించుకున్నప్పుడు మనం దేవుని దీపము అవుతాము – ‘చీకటి నుండి వెలుగు కలుగును గాక’ అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు. అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవుని నుండి కలిగిందే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగివున్నాము.

భక్తితో ‘తమసోమా జ్యోతిర్గమయా’ (దయచేసి నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించండి) అని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము. దేవుడు యేసు ప్రభులో ఆ ప్రార్థనకు సమాధానమిచ్చాడు. నా ప్రియమైన మిత్రమా మీరు “యేసు దీపావళి”ని జరుపుకుంటున్న సందర్భంలో, మీలో వెలుగును (చెడుపై దేవుని విజయం) తీసుకురాగలిగే యేసును ఆహ్వానించాలనే కోరిక మీకు ఉండాలని ఆశిస్తున్నాను. ఈ బహుమానాన్ని మీరు పొంది ఉంటె, అయన ఆత్మ ద్వారా నింపబడి అయన వెలుగు మీలో అధికముగా ప్రకాశించాలని ఆశిస్తున్నాము. ఆయన వెలుగు మనల్ని వెలిగించి ఆ అనుభూతిని మనకి ఇస్తుంది. భగవంతుని నుండి వచ్చే ఈ వెలుగు శాశ్వతమైనది – ‘వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని ఎప్పటికీ చల్లార్చదు’.మీకు “యేసు దీపావళి” శుభాకాంక్షలు. రండి, ఆంతరంగిక అసురుడిని జయించిన పండుగను జరుపుకుందాం.